బెయిర్ స్టోకు గాయం చేసిన అర్జున్! | Arjun Tendulkar Sends Jonny Bairstow Packing at Lord's | Sakshi
Sakshi News home page

బెయిర్ స్టోకు గాయం చేసిన అర్జున్!

Jul 7 2017 3:50 PM | Updated on Sep 5 2017 3:28 PM

బెయిర్ స్టోకు గాయం చేసిన అర్జున్!

బెయిర్ స్టోకు గాయం చేసిన అర్జున్!

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ లో ఇంగ్లండ్ ప్రధాన ఆటగాడు బెయిర్ స్టో గాయపడ్డాడు.

లండన్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ లో ఇంగ్లండ్ ప్రధాన ఆటగాడు బెయిర్ స్టో గాయపడ్డాడు. అర్జున్ వేసిన ఒక చక్కటి యార్కర్కు బెయిర్ స్టోకు గాయమైంది. అర్జున్ వేసిన బంతి స్టో కాలికి బలంగా తాకింది. దాంతో అతను మైదానాన్ని వదిలి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లిపోయాడు.

భారత అండర్-19 జట్టుతో  కలిసి అర్జున్ ఇంగ్లండ్ లో పర్యటిస్తున్నాడు. దానిలో భాగంగా లార్డ్స్ మైదానంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ లో పాల్గొన్నారు. అయితే ఇక్కడ ఇంగ్లండ్ జాతీయ జట్టు సభ్యులు కూడా ప్రాక్టీస్ పాల్గొనడంతో వారికి అర్జున్ బౌలింగ్ చేశాడు. ఆ క్రమంలోనే బెయిర్ స్టోకు బౌలింగ్ చేసి అతన్ని గాయపరిచాడు అర్జున్. అయితే ఇదంతా గురువారం ప్రారంభమైన దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ల తొలి టెస్టుకు ముందు కావడంతో బెయిర్ స్టో తుది జట్టులో ఉండటంపై అనుమానం వ్యక్తమైంది. అయితే అది చిన్నపాటి గాయమే అని తేలడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement