ఆన్య ఖురానాకు స్వర్ణం | Anya Khurana Wins Gold Medal in Skating Championship | Sakshi
Sakshi News home page

ఆన్య ఖురానాకు స్వర్ణం

Mar 18 2019 10:18 AM | Updated on Mar 18 2019 10:18 AM

Anya Khurana  Wins Gold Medal in Skating Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లెజెండ్‌ హంట్‌ రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌ షిప్‌లో ఆన్య ఖురానా విజేతగా నిలిచింది. ఇందిరా పార్క్‌లోని స్కేటింగ్‌ రింక్‌ వేదికగా ఆదివారం జరిగిన 9–11 బాలికల ఫైనల్‌లో ఆన్య అగ్రస్థానాన్ని దక్కించుకుని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. 

రోలర్‌ హాక్స్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో రిధి పటేల్‌ రజతాన్ని సొంతం చేసుకోగా... నమితా నిరెల్‌ ఆడమ్స్‌ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.  బహుమతి ప్రదాన కార్యక్రమంలో భారత రోలర్‌ స్కేటింగ్‌ సమాఖ్య ప్రతినిధి అమిత్‌ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement