పెళ్లి నుంచి తప్పించుకొని.. జాతీయ జట్టుకు ఆడుతూ | Anusha selected for Rugby for National team | Sakshi
Sakshi News home page

Feb 9 2018 9:39 AM | Updated on Feb 9 2018 9:41 AM

Anusha selected for Rugby for National team - Sakshi

అనూష

సాక్షి, హైదరాబాద్‌ : బాల్యవివాహం నుంచి తప్పించుకున్న హైదరాబాద్‌కు యువ క్రీడాకారిణి నేడు జాతీయ రగ్బీ జట్టుకు ఎంపికైంది. వివరాల్లోకి వెళ్తే గత ఏడాది హైదరాబాద్‌కు చెందిన బి అనూష అనే విద్యార్థి పదో తరగతి చదువుతున్న సమయంలో పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు.  వివాహం ఇష్టం లేని అనూష చైల్డ్‌లైన్‌ అధికారులను ఆశ్రయించింది. పెళ్లికి పదిరోజుల ముందు చైల్డ్‌లైన్‌ అధికారులు, స్థానిక పోలీసుల సహకారంతో అనూష వివాహాన్ని అడ్డుకున్నారు. బాల్య వివాహం నేరమౌతుందని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

బాల్యవివాహం నుంచి బయటపడిన అనూష ఇప్పుడు ఇంటర్మీడియట్‌ చదువుతోంది. అంతే కాకుండా మహిళల రగ్బీఆటలో ప్రతిభ చూపింది. జాతీయ జట్టుకు ఎంపికైంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం తన లక్ష్యం అని అనూష తెలిపింది. గతంలో మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో జరిగిన మహిళల అండర్‌-19 క్రికెట్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ తరపున ఆడింది.

Advertisement
 
Advertisement
Advertisement