
న్యూఢిల్లీ: టెస్టుల్లో భారత విజయవంతమైన పేస్ బలగానికి మరో రెండేళ్లు ఎదురేలేదని టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నారు. ఇషాంత్ శర్మ, షమీ, ఉమేశ్ యాదవ్, బుమ్రాలతో కూడిన భారత జట్టు రెండేళ్లుగా ఇంటాబయటా విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే రెండేళ్ల వరకూ కూడా ఈ దళానికి ఢోకాలేదని భరత్ చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు, ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ దాకా వాళ్ల పేస్ పదును కొనసాగుతుందని చెప్పారు. ఆ తర్వాత వెటరన్ పేసర్లు రిటైరైనా బుమ్రా దూకుడు అలాగే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.