'ఐపీఎల్ ఫైనల్ నీకో ఛాన్స్' | Another opportunity to win the final for Dhoni, fleming | Sakshi
Sakshi News home page

'ఐపీఎల్ ఫైనల్ నీకో ఛాన్స్'

May 21 2017 5:43 PM | Updated on Sep 5 2017 11:40 AM

'ఐపీఎల్ ఫైనల్ నీకో ఛాన్స్'

'ఐపీఎల్ ఫైనల్ నీకో ఛాన్స్'

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)10లో ఫైనల్ కు చేరి అందరి అంచనాల్ని తలక్రిందులు చేసింది రైజింగ్ పుణె సూపర్ జెయింట్.

న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)10లో ఫైనల్ కు చేరి అందరి అంచనాల్ని తలక్రిందులు చేసింది రైజింగ్ పుణె సూపర్ జెయింట్. ఇప్పటికే రెండు ఐపీఎల్  టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ ను తుది సమరంలో ఢీకొట్టడానికి సిద్దమైంది. తమ జట్టు ఫైనల్ వరకూ చేరడానికి కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఎంఎస్ ధోనిల మధ్య సఖ్యత బాగుండటమేనని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు.


ధోని, స్మిత్ లు మంచి సారథులుగా ఇప్పటికే నిరూపించుకున్నారు. జట్టులో వారి మధ్య సమన్వయం చాలా బాగుంది. ఇదే మా జట్టు ఫైనల్ కు చేరడానికి దోహదం చేసింది. వీరిద్దరూ సీనియర్లు కావడంతో కోచ్ గా నాకు కాస్త భారం తగ్గింది. యువ క్రికెటర్లు వీరి నుంచి ఎక్కువ నేర్చుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఈ పదేళ్ల ఐపీఎల్ ను చూస్తే అత్యంత విజయవంతమైన క్రికెటర్ ధోని. ప్రస్తుతం ధోని కోసం మరో ఐపీఎల్ ఫైనల్ ఎదురుచూస్తోంది' అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement