ఆనంద్‌కు తొలి విజయం  | Anand to play Vachier-Lagrave in round 7 of Altibox chess | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు తొలి విజయం 

Jun 6 2018 1:22 AM | Updated on Jun 6 2018 1:22 AM

Anand to play Vachier-Lagrave in round 7 of Altibox chess - Sakshi

ఆల్టిబాక్స్‌ నార్వే ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో వరుసగా ఆరు ‘డ్రా’లు నమోదు చేసిన తర్వాత... భారత గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ ఖాతాలో తొలి విజయం చేరింది. నార్వేలోని స్టావెంజర్‌ నగరంలో జరుగుతోన్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన ఏడో రౌండ్‌లో ఆనంద్‌ 40 ఎత్తుల్లో మాక్సిమి వాచియెర్‌ లాగ్రేవ్‌ (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు. బుధవారం జరిగే ఎనిమిదో రౌండ్‌లో ఫాబియానో కరువానా (అమెరికా)తో ఆనంద్‌ తలపడతాడు.    

Advertisement
 
Advertisement
Advertisement