
ఆనంద్‌కు ‘మాస్టర్స్' టైటిల్
బిల్బావో (స్పెయిన్): ప్రతిష్టాత్మక బిల్బావో చెస్ మాస్టర్స్ ఫైనల్ టైటిల్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలిసారి చేజిక్కించుకున్నాడు.
బిల్బావో (స్పెయిన్): ప్రతిష్టాత్మక బిల్బావో చెస్ మాస్టర్స్ ఫైనల్ టైటిల్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలిసారి చేజిక్కించుకున్నాడు. మరో రౌండ్ మిగిలి ఉండగానే ఈ టోర్నీలో ఆనంద్‌కు టైటిల్ ఖాయమైంది. రౌండ్ రాబిన్ లీగ్ రెండో దశలో భాగంగా శుక్రవారం పొనమరియోవ్ (ఉక్రెయిన్)తో జరిగిన ఐదో గేమ్‌ను ఆనంద్ 37 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిం చాడు. ఈ రౌండ్ తర్వాత 11 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. మరోవైపు అరోనియన్ (ఆర్మేనియా), ఫ్రాన్సిస్కో వలెజో (స్పెయిన్)ల మధ్య జరిగిన గేమ్ 59 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యింది. దాంతో అరోనియన్ 7 పాయిం ట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆనంద్, అరోనియన్‌ల మధ్య చివరిదైన ఆరో రౌండ్ గేమ్ శనివారం జరుగుతుంది.