ఆనంద్‌కు ఐదో ‘డ్రా’ | Anand Fifth draw | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు ఐదో ‘డ్రా’

Sep 1 2015 12:32 AM | Updated on Sep 3 2017 8:29 AM

ఆనంద్‌కు ఐదో ‘డ్రా’

ఆనంద్‌కు ఐదో ‘డ్రా’

సింక్యూఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా ఐదో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు...

సెయింట్ లూయిస్: సింక్యూఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా ఐదో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. సో వెస్లీ (అమెరికా)తో జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. తొలి రెండు రౌండ్‌లలో ఓడిన ఆనం ద్ ఆ తర్వాత వరుసగా ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకోవడం గమనార్హం. మిగి లిన రెండు రౌండ్‌లలో అరోనియన్, కార్ల్‌సన్ లతో ఆనంద్ తలపడతాడు. ప్రస్తు తం ఆనంద్ 2.5 పాయిం ట్లతో 9వ స్థానంలో ఉన్నా డు. మరో గేమ్‌లో ప్రపంచ చాంపియన్ కార్ల్‌సన్ ఆరున్నర గంటలు పోరాడినా తుదకు 66 ఎత్తుల్లో గ్రిష్‌చుక్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement