ఆనంద్ ‘డ్రా’ల పర్వం | Anand draws with Kramnik in fourth round of Shamkir Chess 2015 | Sakshi
Sakshi News home page

ఆనంద్ ‘డ్రా’ల పర్వం

Apr 21 2015 12:39 AM | Updated on Sep 3 2017 12:35 AM

వుగార్ గషిమోవ్ స్మారక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ‘డ్రా’ల పర్వం

షామ్‌కిర్ (అజర్‌బైజాన్): వుగార్ గషిమోవ్ స్మారక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ‘డ్రా’ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వరుసగా మూడు ‘డ్రా’లు నమోదు చేసిన ఈ ప్రపంచ మాజీ చాంపియన్ నాలుగో రౌండ్‌లోనూ ‘డ్రా’తో సరిపెట్టుకున్నాడు.

ప్రపంచ మాజీ చాంపియన్ వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా)తో సోమవారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 38 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement