సూపర్ స్టార్ సూపర్ పంచ్! | Amitabh Bachchan Thanks Australian media for accepting Virat Kohli as a winner | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్ సూపర్ పంచ్!

Mar 22 2017 12:08 PM | Updated on Sep 5 2017 6:48 AM

సూపర్ స్టార్ సూపర్ పంచ్!

సూపర్ స్టార్ సూపర్ పంచ్!

విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మీడియా చేసిన వ్యాఖ్యలపై అమితాబ్ బచ్చన్ తనదైన శైలిలో స్పందించారు.

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మీడియా చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తనదైన శైలిలో స్పందించారు. ‘మిస్టర్ ఫైర్’ గురించి వాస్తవాలు ఒప్పుకున్నందుకు ఆసీస్ మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. ‘క్రీడల్లో విరాట్ కోహ్లి డొనాల్డ్ ట్రంప్ వంటి వాడని ఆసీస్ మీడియా పోల్చింది. కోహ్లి విజయుడని, ప్రెసిడెంట్ అని ఒప్పుకున్నందుకు ఆస్ట్రేలియా మీడియా ధన్యవాదాల’ని అమితాబ్ ట్వీట్ చేశారు. తాను రెండు చేతులతో నమస్కరిస్తున్న ఫొటో కూడా ట్విటర్ లో పోస్టు చేశారు.

భారత్ లో జరుగుతున్న టెస్టు సిరీస్ లో స్టీవ్‌ స్మిత్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ రివ్యూపై గళమెత్తినప్పటి నుంచి విరాట్‌ కోహ్లిపై ఆస్ట్రేలియా మీడియా తమ అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. తాజాగా కోహ్లిని వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లోకెక్కుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పోల్చింది. ‘ప్రపంచ క్రికెట్‌లో విరాట్‌ కోహ్లి మరో డొనాల్డ్‌ ట్రంప్‌గా మారాడు. ఎందుకంటే ట్రంప్‌లాగే తాను కూడా ముఖంపై ఉన్న కోడి గుడ్డు మరకలను దాచుకుంటూ మీడియాను అవమానపరచాలని నిర్ణయించుకున్నాడు’ అని ది డెయిలీ టెలిగ్రాఫ్‌ పత్రిక పేర్కొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement