అమెరికా కోచ్‌గా వెంకటపతిరాజు | American coach venkatapatiraju | Sakshi
Sakshi News home page

అమెరికా కోచ్‌గా వెంకటపతిరాజు

Aug 28 2015 12:05 AM | Updated on Sep 3 2017 8:14 AM

అమెరికా కోచ్‌గా వెంకటపతిరాజు

అమెరికా కోచ్‌గా వెంకటపతిరాజు

భారత మాజీ క్రికెటర్, హైదరాబాద్‌కు చెందిన ఎస్. వెంకటపతిరాజుకు అరుదైన అవకాశం దక్కింది

దుబాయ్ : భారత మాజీ క్రికెటర్, హైదరాబాద్‌కు చెందిన ఎస్. వెంకటపతిరాజుకు అరుదైన అవకాశం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పర్యవేక్షణలోని అమెరికా క్రికెట్ జట్టు కోచ్‌లలో ఒకడిగా అతను వ్యవహరిస్తాడు. ‘ఐసీసీ అమెరికాస్ క్రికెట్ కంబైన్’ అనే పేరుతో వ్యవహరిస్తున్న ఈ జట్టుకు శిక్షణ ఇచ్చేందుకు ఐసీసీ కోచ్‌ల బృందాన్ని ఎంపిక చేసింది. రాజుతో పాటు బౌలింగ్ దిగ్గజం కోట్నీ వాల్ష్ కూడా ఇందులో ఉన్నారు.

క్రికెటర్‌గా రిటైర్ అయిన తర్వాత రాజు... భారత జట్టు సెలక్టర్‌గా, హైదరాబాద్ రంజీ జట్టు కోచ్‌గా పని చేయడంతో పాటు హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. ఇటీవలి వరకు ఐసీసీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఆసియా రీజియన్ అభివృద్ధి అధికారిగా కూడా పని చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement