అగార్కర్‌కు షాక్‌ ఇచ్చిన సీఏసీ

Ajit Agarkar Ignored As BCCI Shortlists Five Candidates  - Sakshi

ముంబై: బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ పదవి రేసులో అందరి కంటే ముందున్నాడనుకున్న భారత మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌కు క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) షాకిచ్చింది. మంగళవారం సమావేశమైన మదన్‌ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లతో కూడిన సీఏసీ... అగార్కర్‌ దరఖాస్తును తిరస్కరించింది. రెండు ఖాళీల కోసం 44 మంది దరఖాస్తు చేసుకోగా... అందులో నుంచి వెంకటేశ్‌ ప్రసాద్, సునీల్‌ జోషి, లక్ష్మణ్‌ శివరామకృష్ణన్, హర్విందర్‌ సింగ్, రాజేశ్‌ చౌహాన్‌లను ఇంటర్వ్యూల కోసం ఖరారు చేసింది.

జోన్ల ప్రాతిపదికన సెలక్టర్లను ఎంపిక చేయాలని సీఏసీ సభ్యులు నిర్ణయించుకోవడంతో అగార్కర్‌ను పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. పదవీ కాలం ముగిసిన సెలెక్టర్లలో గగన్‌ ఖోడా సెంట్రల్‌ జోన్‌కు చెందిన వాడు కావడంతో ఆ జోన్‌ నుంచి హర్విందర్‌ సింగ్‌ను... ఎమ్మెస్కే ప్రసాద్‌ది సౌత్‌ జోన్‌ కావడంతో వెంకటేశ్‌ ప్రసాద్, శివరామకృష్ణన్, సునీల్‌ జోషిలను తదుపరి దశకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. (చదవండి: పాండ్యా సూపర్‌ ఇన్నింగ్స్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top