రహానే తొలి టెస్టు సెంచరీ మిస్ | Ajinkya Rahane misses maiden Test ton by Four runs | Sakshi
Sakshi News home page

రహానే తొలి టెస్టు సెంచరీ మిస్

Dec 30 2013 6:22 PM | Updated on Sep 2 2017 2:07 AM

రహానే తొలి టెస్టు సెంచరీ మిస్

రహానే తొలి టెస్టు సెంచరీ మిస్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆటగాడు అజింక్య రహానే కొద్దిలో సెంచరీ కోల్పోయాడు. నాలుగు పరుగుల తేడాతో శతకం చేజార్చుకున్నాడు.

డర్బన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆటగాడు అజింక్య రహానే కొద్దిలో సెంచరీ కోల్పోయాడు. నాలుగు పరుగుల తేడాతో తొలి టెస్టు శతకం చేజార్చుకున్నాడు. 96 పరుగులు చేసి ఫిలాండర్ బౌలింగ్లో అవుటయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 223 పరుగులకు ఆలౌటయింది. రహానే ఒక్కడే రాణించాడు. ఒక్కపక్క వికెట్లు పడుతున్నా తాను మాత్రం సంయమనం కోల్పోకుండా ఆడాడు. 96 పరుగుల వద్ద చివరి వికెట్గా వెనుదిరిగాడు.

దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి భారత్ బ్యాట్స్మెన్ విలవిల్లాడారు. ఇలా వచ్చి అలా వెళ్లారు. ధావన్ 19, విజయ్ 6, పూజారా 32, కోహ్లి 11, రోహిత్ శర్మ 25, ధోని 15, జడేజా 8, జహీర్ ఖాన్ 3 పరుగులు చేశారు. మొదటి ఇన్నింగ్స్లోనూ రహానే రాణించాడు. 51 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement