రాణించిన రహానే, ఇషాన్‌ 

Ajinkya Rahane, Ishan Kishan, Shreyas Iyer impress as India A defeat England Lions by three wickets - Sakshi

తిరువనంతపురం: కెప్టెన్‌ అజింక్య రహానే (59; 4 ఫోర్లు), వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ (57 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌) ఆకట్టుకోవడంతో... ఇంగ్లండ్‌ లయన్స్‌తో బుధవారం జరిగిన తొలి అనధికారిక వన్డేలో భారత ‘ఎ’ జట్టు మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట ఇంగ్లండ్‌ లయన్స్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 285 పరుగులు సాధించింది.

సామ్‌ బిల్లింగ్స్‌ (108 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు. భారత ‘ఎ’ బౌలర్లలో సిద్ధార్థ్‌ కౌల్, మయాంక్‌ మార్కండే, అక్షర్‌ పటేల్‌ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం భారత్‌ ‘ఎ’ 49.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసి విజయం సాధించింది. రహానే, ఇషాన్‌ కిషన్‌లతోపాటు అన్‌మోల్‌ ప్రీత్‌ సింగ్‌ (33; 5 ఫోర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (45; ఫోర్, 3 సిక్స్‌లు) కూడా రాణించారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top