
అండర్ 19 ప్రపంచకప్‌లో వికెట్ తీసిన ఆనందంలో అనుకుల్
న్యూఢిల్లీ : అండర్-19 ప్రపంచకప్ విజేత భారత జట్టులో సభ్యుడైన అనుకుల్ రాయ్‌పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రికెస్ అసోసియేషన్ ఆఫ్ బిహార్(సీఏవో) కార్యదర్శి ఆదిత్య వర్మ అనుకుల్‌పై ఆరోపణలు చేశారు.
అండర్-19లో పాల్గొనేందుకు అనుకుల్ వయసు పరంగా మోసం చేశాడని అన్నారు. ఈ విషయం బీసీసీఐ ప్రస్తుత కార్యదర్శి అమితాబ్ చౌదరికి కూడా తెలుసునంటూ బాంబు పేల్చారు. ఆదిత్య వర్మ ఆరోపణలను అనుకుల్ ఖండించాడు.
ఆదిత్య ఏం మాట్లాడుతున్నారో తనకు తెలియదని, అన్ని రకాల పరీక్షలు పూర్తైన తర్వాత తాను ప్రపంచకప్‌కు ఆడేందుకు వెళ్లినట్లు చెప్పాడు. స్పిన్నరైన అనుకుల్ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు.