స్టన్నింగ్‌ బంతులతో బిత్తరపోయారు | Afridi Wonder Balls Stunned Karachi Kings Players | Sakshi
Sakshi News home page

Mar 12 2018 8:31 AM | Updated on Mar 12 2018 11:21 AM

Afridi Wonder Balls Stunned Karachi Kings Players - Sakshi

వికెట్‌ తీసిన అనంతరం షాహిద్‌ అఫ్రీది

సాక్షి, స్పోర్ట్స్‌ : పాకిస్థాన్‌ జట్టు మాజీ ఆటగాడు, ఆల్‌ రౌండర్‌ షాహిద్ అఫ్రీది బంతితో తన సత్తా చాటాడు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ ఆటగాళ్లను తన లెగ్‌ స్పిన్‌తో బెంబేలెత్తించాడు. అద్భుత బంతులతో మూడు కీలక వికెట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

ఆదివారం దుబాయ్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌, కరాచీ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన కరాచీ జట్టు 188 పరుగులు సాధించింది. తర్వాత 189 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముల్తాన్‌ జట్టు కేవలం 125 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. అఫ్రీది బౌలింగ్‌తో బరిలోకి దిగాక మ్యాచ్‌ సమీకరణాలు మొత్తం మారిపోయాయి. పోలార్డ్‌, షోయబ్‌ మాలిక్‌, సైఫ్‌ బాబర్‌ వంటి కీలక బ్యాట్స్‌ మన్లను పెవీలియన్‌కు చేర్చాడు. ముఖ్యంగా పోలార్డ్‌.. అఫ్రీది వేసిన బంతి స్వింగ్‌ అయి వికెట్లను తాకటంతో ఆశ్చర్యపోయాడు. అఫ్రీది నాలుగు ఓవర్లలో(ఒక మెయిడెన్‌) కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి సుల్తాన్స్‌ జట్టు దూకుడుకు కళ్లెం వేశాడు. ఈ దఫా పీఎస్‌ఎల్‌ లో అఫ్రీది బ్యాటింగ్‌ కన్నా బౌలింగ్‌ తోనే రాణిస్తుండటం విశేషం.

అఫ్రీది క్షమాపణలు...
ఆల్‌ రౌండర్‌ సైఫ్‌ బాదర్‌ ను అవుట్‌ చేశాక అఫ్రీది కాస్త దురుసుతనం ప్రదర్శించాడు. అనుచిత వ్యాఖ్యలు చేయటంతో సోషల్‌ మీడియాలో ఈ సీనియర్‌ ఆటగాడి తీరుపై విమర్శలు వినిపించాయి. అయినప్పటికీ బాదర్‌ ఈ వీడియోకు స్పందిస్తూ... ఇప్పటికీ నువ్వంటే ఇష్టం షాహిద్‌ భాయ్‌ అంటూ పోస్ట్‌ చేశాడు. దీంతో బాదర్‌కు క్షమాపణలు చెబుతున్నట్లు అఫ్రీది ప్రకటించటంతో వివాదానికి తెర పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement