క్రికెటర్‌ షాజాద్‌పై ఏడాది నిషేధం

Afghanistan's wicket keeper Mohammad Shahzad suspended for doping violation - Sakshi

దుబాయ్‌: ఆఫ్గానిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ మొహ్మద్‌ షాజాద్‌ డోప్‌ పరీక్షలో విఫలమయ్యాడు. దాంతో అతనిపై ఏడాదిపాటు సస్పెన్షన్‌ విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ప్రకటించింది. తనకు తెలియకుండానే హైడ్రోక్సికట్‌ అనే ఉత్ర్పేరకాన్ని బరువు తగ్గేందు కు తీసుకున్నట్లు అంగీకరించాడని ఐసీసీ తెలిపింది. ఈ ఏడాది జనవరి 17న డోపింగ్‌ టెస్టుకు తన మూత్రం శాంపిల్‌ ఇచ్చినపుడు అతడు నిషేధిత ఉత్ర్పేరకం క్లెన్‌బుటెరాల్‌ సేవించినట్టు వెల్లడైంది. క్లెన్‌బుటెరాల్‌ స్టెరాయిడ్‌గా పేర్కొనే ఈ ఉత్పేరకం వాడకంపై వాడా (వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ) నిషేధించింది.

నిబంధనల ప్రకారం అతనిపై నిషేధం విధించినట్టు ఐసీసీ వెల్లడించింది. షాజాద్‌ 58 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లలో అఫ్ఘానిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అతనిపై నిషేధం వచ్చే జనవరి 17న ముగియనున్నట్టు ఐసీసీ తెలిపింది. దాదాపు 11 నెలల కాలం నుంచి షాజాద్‌పై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి నెలలో అతను తిరిగి క్రికెట్‌ ఆడతాడని ఐసీసీ పేర్కొంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top