నాపై కుట్ర చేశారు: క్రికెటర్‌

Afghanistan cricket board conspired against me, says Shahzad - Sakshi

కాబూల్‌: వన్డే వరల్డ్‌కప్‌లో తాను ఆడకుండా తమ క్రికెట్‌ బోర్డు కుట్ర పన్నిందని అఫ్గానిస్తాన్‌ క్రికెటర్‌ మహ్మద్‌ షెహజాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఫిట్‌గా ఉన్నప్పటికీ అర్థాంతరంగా జట్టు నుంచి తొలగించారంటూ బోర్డుపై విరుచుకుపడ్డాడు. తాజా వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లతో వరుస రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత ఫిట్‌నెస్‌ లేదంటూ షెహజాద్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన షెహజాద్‌.. తనను తప్పించడంలో బోర్డు పెద్దల కుట్ర దాగి ఉందంటూ విమర్శలు చేశాడు.
(ఇక్కడ చదవండి: వరల్డ్‌కప్‌: అఫ్గాన్‌కు షాక్‌)

‘నన్ను ఎందుకు తొలగించారో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఫిట్‌నెస్‌ సాకుతో నన్ను జట్టు నుంచి తప్పించారు. నాకు మ్యాచ్‌లు ఆడేందుకు సరిపడా ఫిట్‌నెస్‌ ఉంది. బోర్డులో కొంతమంది కలిసి నాపై కుట్ర పన్నారు.ఇందుకు కేవలం జట్టు మేనేజర్‌, డాక్టర్‌, కెప్టెన్లే కారణం. ఇది నన్ను తీవ్రంగా కలిచి వేసింది. మాకు కోచ్‌ కూడా నన్ను తప్పించిన విషయం తర్వాత కానీ తెలియలేదు. న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు ముందు నా ఫిట్‌నెస్‌ బాగానే ఉంది. మోకాలి గాయమంటూ చెప్పి మొత్తం టోర్నీ నుంచి తొలగించారు. ఆటగాళ్ల ఎవ్వరికీ కూడా నన్ను తప్పించిన విషయం తెలియదు. ఈ వార్త విని వారంతా షాక్‌ అయ్యారు’ అని షెహజాద్‌ తెలిపాడు.


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top