
లండన్: వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్‌కు షాక్ తగిలింది. అఫ్గానిస్తాన్ విధ్వంసకర ఆటగాడు, వికెట్ కీపర్ మహ్మద్ షెహజాద్ వరల్డ్‌కప్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అఫ్గాన్ బ్యాటింగ్‌లో కీలక ఆటగాడైన షెహజాద్.. పాకిస్తాన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. అయితే ఆసీస్, శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఆడిన షెహజాద్‌కు గాయం తీవ్రత ఎక్కువ కావడంతో మిగతా టోర్నీకి దూరమయ్యాడు.
కాగా, 2015 ప్రపంచకప్ నుంచి అఫ్గాన్‌కు ప్రధాన బ్యాట్స్‌మన్‌గా ఉన్న షెహజాద్ 55 మ్యాచ్‌ల్లో 1843 పరుగులు చేశాడు. అతను అఫ్గాన్ తరఫున అత్యధిక వన్డే పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. టాప్ ఆర్డర్‌లో కీలకమైన ఆటగాడిని కోల్పోవడం అఫ్గాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ. అతడి స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇక్ర్‌మ్ అలీకి స్థానం కల్పించారు. అఫ్గాన్ తరఫున ఇక్రమ్ అలీ ఇప్పటివరకు ఆడింది రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లే కావడం విశేషం. ఈ ఏడాది మార్చిలో డెహ్రాడూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతడు అరంగేట్రం చేశాడు. 2018లో అఫ్గాన్ తరఫున అండర్ 19 ప్రపంచకప్ జట్టులో ఆడిన అనుభవం అతడి సొంతం. ఆ సిరీస్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో 185 పరుగులు చేశాడు.