ఫోన్ ట్యాపింగ్ కు రూ.14 కోట్లు ఇచ్చారు! | Aditya Verma writes to PM on alleged phone-tapping controversy | Sakshi
Sakshi News home page

ఫోన్ ట్యాపింగ్ కు రూ.14 కోట్లు ఇచ్చారు!

May 9 2015 7:55 PM | Updated on Sep 3 2017 1:44 AM

ఫోన్ ట్యాపింగ్ కు రూ.14 కోట్లు ఇచ్చారు!

ఫోన్ ట్యాపింగ్ కు రూ.14 కోట్లు ఇచ్చారు!

ఈ ఏడాది మార్చిలో క్రికెట్ సీనియర్ సభ్యుల సాధారణ వార్షిక సమావేశంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు బీహార్ క్రికెట్ అసోసియేషన్ (గుర్తింపులేదు) కార్యదర్శి ఆదిత్య వర్మ పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ:ఈ ఏడాది మార్చిలో క్రికెట్ సీనియర్ సభ్యుల సాధారణ వార్షిక సమావేశంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు బీహార్ క్రికెట్ అసోసియేషన్ (గుర్తింపులేదు) కార్యదర్శి ఆదిత్య వర్మ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇందులో బీసీసీఐ మాజీ కార్యదర్శి సంజయ్ పటేల్ పాత్ర ఉన్నట్లు ఆయన ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. ఆ వివాదంపై ఒక కమిటీ వేసి నిజాలను వెలికి తీయాల్సిన ఉందని మోదీకి తెలిపారు. బోర్డు అధికారులు పాల్గొన్న ఆ సమావేశంలో సంజయ్ పటేల్ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని  పేర్కొన్నారు. సంజయ్ పటేల్ రూ.14 కోట్లను లండన్ కు చెందిన ప్రైవేట్ సంస్థకు చెల్లించి మరీ ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఈమెయిల్స్ హ్యాక్ చేసినట్లు ఆ లేఖలో తెలిపారు. లండన్ కు చెందిన ఓ డిటెక్టివ్ ఏజెన్సీ ద్వారా ఫోన్ ట్యాపింగ్ వివాదం బయటపడినట్లు ఆదిత్యవర్మ పేర్కొన్నారు. 

 

ఇదిలా ఉంటే ఆ వ్యాఖ్యలను సంజేల్ పటేల్ కొట్టిపారేశారు. దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని.. తాను వేరే కారణాలతోనే ఆ డబ్బును వినియోగించినట్లు సంజయ్ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement