ఒత్తిడిని అధిగమిస్తాం | Adhigamistam pressure | Sakshi
Sakshi News home page

ఒత్తిడిని అధిగమిస్తాం

Jan 16 2017 12:49 AM | Updated on Oct 9 2018 5:31 PM

ఈ సీజన్‌లో మాంచెస్టర్‌ యునైటెడ్‌ జట్టు తరఫున ఆండర్‌ హెరేరా కీలక ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు.

హెరేరా

ఈ సీజన్‌లో మాంచెస్టర్‌ యునైటెడ్‌ జట్టు తరఫున ఆండర్‌ హెరేరా కీలక ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. మిడ్‌ఫీల్డ్‌లో నిలకడైన ప్రదర్శనతో జట్టుకు బాసటగా నిలవడమే కాకుండా అప్పుడప్పుడూ కెప్టెన్‌గా కూడా సేవలందిస్తున్నాడు. వరుసగా ఈ జట్టు తొమ్మిది విజయాలతో దూసుకెళుతుండగా దీంట్లో ఆండర్‌దే కీలక పాత్రగా భావించవచ్చు. ఈ నేపథ్యంలో సొంత వేదికపై తమ ప్రధాన ప్రత్యర్థి లివర్‌పూల్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లోనూ తమ జోరు కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

నూతన సంవత్సరం మీ తొలి మ్యాచ్‌లోనే భారీ ఒత్తిడితో బరిలోకి దిగబోతున్నారు. ఈ ఏడాదిని మాంచెస్టర్‌దిగా చెప్పుకోవచ్చా?
అలాగే జరగాలని భావిస్తున్నాను. మేం ప్రస్తుతం మంచి సమన్వయంతో వెళుతున్నాం. జట్టు ఆటగాళ్లు పడుతున్న శ్రమను చూస్తే ఒత్తిడిని అధిగమించి విజయాన్ని అందుకుంటాం.

లివర్‌పూల్‌తో మీకు ఎప్పటికీ పోటీపరంగా శత్రుత్వముంటుంది. ఓల్ట్‌ ట్రాఫోర్డ్‌లో వారిని ఓడించడంపై జట్టు మీద ఒత్తిడి అధికంగా ఉంటుంది. అద్భుత ఫామ్‌లో ఉన్న ఆ జట్టును ఓడించేందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు?
నేను ఈ జట్టులో ఉన్న సమయంలో ఆరేడుసార్లు లివర్‌పూల్‌తో ఆడగా నాలుగు సార్లు గెలిచాం. దీంతోనే మా ఆటతీరు ఎలాంటిదో చెప్పవచ్చు. సొంత వేదికపై ఆడుతున్నప్పుడు నాలో పోరాటతత్వం మరింత పెరుగుతుంది. ఆ జట్టు ఫామ్‌లో ఉన్నా మేం గెలవాలనే కోరుకుంటున్నాం.

లివర్‌పూల్‌ను ఎదుర్కొనే సత్తా కలిగిన ఆటగాళ్లు ఇప్పుడు మీ జట్టులో ఉన్నారని భావిస్తున్నారా?
మా జట్టు పటిష్టంగా ఉంది. ఇలాంటి మ్యాచ్‌ల్లో మేజిక్‌ జరగాలి. పాల్‌ పోగ్బా ఒక సెకన్‌లో మ్యాచ్‌ తీరును మార్చగలడు. అద్భుతమైన షాట్స్‌ ఆటగలడు. అతడో అత్యుత్తమ ఆటగాడు. ఇబ్రహిమోవిక్, రూనీ జువాన్‌ మాటా, మార్షల్‌లూ కీలకమే. వీరు తమ ఉత్తమ ఆటతీరును చూపకపోయినా మ్యాచ్‌ను మార్చగలరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement