ఓటమి తప్పలేదు | England Vs India: England victory over India | Sakshi
Sakshi News home page

England Vs India: ఓటమి తప్పలేదు

Jul 4 2026 10:48 PM | Updated on Jul 5 2026 4:01 AM

England Vs India: England victory over India

రెండో టి20లో భారత్‌ పరాజయం 

4 వికెట్లతో గెలిచిన ఇంగ్లండ్‌ 

మంగళవారం మూడో టి20 మ్యాచ్‌ 

మాంచెస్టర్‌: ఐర్లాండ్‌–ఇంగ్లండ్‌ పర్యటనలో భారత్‌కు ఇంకా గెలుపు బోణీ దక్కలేదు. తొలి విజయం కోసం జట్టు ఇంకా ఎదురు చూడాల్సిన పరిస్థితిలోనే నిలిచింది. అయితే మ్యాచ్‌ ఫలితంకంటే ఎక్కువగా ఆసక్తి రేపిన, టీమిండియా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన క్షణం ఈ మ్యాచ్‌లో వచ్చింది. సంచలన బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ భారత 122వ టి20 ఆటగాడిగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. శనివారం జరిగిన రెండో టి20లో ఇంగ్లండ్‌ 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. 

ఇషాన్‌ కిషన్‌ (40 బంతుల్లో 49; 6 ఫోర్లు), అభిషేక్‌ శర్మ (24 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (22 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా...చివర్లో తిలక్‌ వర్మ (11 బంతుల్లో 24 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. వైభవ్‌ సూర్యవంశీ 10 బంతుల్లో 2 సిక్స్‌లతో 14 పరుగులు చేశాడు. అనంతరం ఇంగ్లండ్‌ 19 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసి విజయాన్నందుకుంది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జాకబ్‌ బెతెల్‌ (46 బంతుల్లో 76 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా...కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (15 బంతుల్లో 39; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), టామ్‌ బాంటన్‌ (32 బంతుల్లో 39; 6 ఫోర్లు) రాణించారు. చివర్లో విజయం కోసం ఇంగ్లండ్‌ 24 బంతుల్లో 49 పరుగులు చేయాల్సి ఉండటంతో భారత్‌దే పైచేయిగా కనిపించగా... 17వ ఓవర్‌ వేసిన రవి బిష్ణోయ్‌ ఏకంగా 29 పరుగులు ఇవ్వడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 

స్కోరు వివరాలు  
భారత్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) బాంటన్‌ (బి) కరన్‌ 43; వైభవ్‌ (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) జాక్స్‌ 14; ఇషాన్‌ కిషన్‌ (సి) డాసన్‌ (బి) కరన్‌ 49; అయ్యర్‌ (సి) బాంటన్‌ (బి) డాసన్‌ 37; దూబే (సి) బాంటన్‌ (బి) కరన్‌ 5; తిలక్‌ (నాటౌట్‌) 24; అక్షర్‌ (రనౌట్‌) 2; రాణా (సి) బట్లర్‌ (బి) ఆర్చర్‌ 6; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 190.  వికెట్ల పతనం: 1–50, 2–65, 3–130, 4–146, 5–157, 6–165, 7–190. బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–40–1, టంగ్‌ 4–0–46–0, జాక్స్‌ 3–0–22–1, స్యామ్‌ కరన్‌ 4–0–33–3, డాసన్‌ 3–0–27–1, రషీద్‌ 2–0–21–0.  

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) అర్ష్ దీప్  0; బట్లర్‌ (సి) వరుణ్‌ (బి) అర్ష్ దీప్  0; బ్రూక్‌ (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) అక్షర్‌ 39; బెతెల్‌ (నాటౌట్‌) 76; బాంటన్‌ (సి) తిలక్‌ (బి) అర్ష్ దీప్  39; జాక్స్‌ (ఎల్బీ) (బి) వరుణ్‌ 9; కరన్‌ (సి) వైభవ్‌ (బి) రాణా 7; ఆర్చర్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19 ఓవర్లలో 6 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–0, 2–1, 3–51, 4–118, 5–133, 6–179. బౌలింగ్‌: అర్ష్ దీప్  4–0–40–3, హర్షిత్‌ రాణా 3–0–30–1, బిష్ణోయ్‌ 4–0–60–0, అక్షర్‌ 4–0–20–1, వరుణ్‌ 4–0–37–1.

1 అతి పిన్న వయసులో భారత్‌ తరఫున అంతర్జాతీయ (పురుషుల) క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా వైభవ్‌ నిలిచాడు. ఇప్పటి వరకు సచిన్‌ టెండూల్కర్‌ (16 ఏళ్ల 205 రోజులు) పేరిట ఉన్న రికార్డును అతను బద్దలుకొట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement