'ఆ బౌలర్ ఆడకపోవడం మాకు లోటే' | Absence of Nehra hurt us, says Eoin Morgan | Sakshi
Sakshi News home page

'ఆ బౌలర్ ఆడకపోవడం మాకు లోటే'

May 21 2016 6:32 PM | Updated on Sep 4 2017 12:37 AM

'ఆ బౌలర్ ఆడకపోవడం మాకు లోటే'

'ఆ బౌలర్ ఆడకపోవడం మాకు లోటే'

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 సీజన్ నుంచి గాయం కారణంగా తమ స్టార్ బౌలర్ ఆశిస్ నెహ్రా వైదొలగడం పూడ్చలేనిదేనని సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ తెలిపాడు.

రాయ్ పూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 సీజన్ నుంచి గాయం కారణంగా తమ స్టార్ బౌలర్ ఆశిస్ నెహ్రా వైదొలగడం  పూడ్చలేనిదేనని సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. ఈ సీజన్ లో అత్యంత నిలకడగా బౌలింగ్ చేసిన నెహ్రా తొడ కండరాల గాయంతో టోర్నీ నుంచి తప్పుకోవడం నిజంగా బాధాకరమేన్నాడు. 'ఆశిష్ నెహ్రా లేని లోటు పూడ్చలేనిది. రాయల్ చాలెంజర్స్ తో జరిగిన తొలి గేమ్ అనంతరం నెహ్రా గాయ పడ్డాడు. సీనియర్ బౌలర్ నెహ్రా అర్థాంతరంగా టోర్నీకి దూరం కావడం జట్టు మొత్తాన్ని బాధించింది. దీంతో అతని స్థానాన్ని బరిందర్ శ్రవణ్ తో భర్తీ చేయనున్నాం'అని మోర్గాన్ పేర్కొన్నాడు.

ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో మంచి స్కోరునే బోర్డుపై ఉంచినా ఓటమి పాలు కావడం నిరాశకు గురి చేసిందన్నాడు. ఢిల్లీ  విజయంలో ఆ క్రెడిట్ అంతా కరుణ్ నాయర్ కే దక్కుతుందన్నాడు. మధ్య ఓవర్లలో సన్ రైజర్స్ హిట్టింగ్ చేయడంలో విఫలం చెందుతుందని అనుకుంటున్నారా?అన్న ప్రశ్నకు మోర్గాన్ తనదైన శైలిలో జవాబిచ్చాడు.  నాతో పాటు, యువరాజ్ సింగ్, హెన్రీక్యూస్ లు హిట్టింగ్ పాత్రను పోషిస్తున్నారు కదా అని ఎదురుప్రశ్నించాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement