డివిలియర్స్, ఆమ్లా సెంచరీలు

డివిలియర్స్, ఆమ్లా సెంచరీలు


దక్షిణాఫ్రికా 340/3

 సెంచూరియన్: వెస్టిండీస్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా మొదటి రోజు భారీ స్కోరు నమోదు చేసింది. బుధవారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 91 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ (211 బంతుల్లో 141 బ్యాటింగ్; 15 ఫోర్లు, 2 సిక్సర్లు), హషీమ్ ఆమ్లా (242 బంతుల్లో 133 బ్యాటింగ్; 17 ఫోర్లు) సెంచరీలతో చెలరేగడం విశేషం.



వీరిద్దరు నాలుగో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 283 పరుగులు జోడించారు. టెస్టుల్లో డివిలియర్స్‌కు ఇది 20వ సెంచరీ కాగా, ఆమ్లాకు 23వది. విండీస్ బౌలర్లు ఆరంభంలో రాణించడంతో దక్షిణాఫ్రికా 57 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. పీటర్సన్ (27), ఎల్గర్ (28), డు ప్లెసిస్ (0) ఒకే స్కోరు వద్ద వెనుదిరిగారు. అయితే ఆ తర్వాత డివిలియర్స్, ఆమ్లా కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. రోచ్ 2 వికెట్లు పడగొట్టగా, కాట్రెల్‌కు ఒక వికెట్ దక్కింది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top