
పాక్ జట్టులో ఆమిర్
స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఐదేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్న పాకిస్తాన్ లెఫ్టార్మ్ పేస్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు.
న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక
కరాచీ: స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఐదే ళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్న పాకిస్తాన్ లెఫ్టార్మ్ పేస్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. న్యూజిలాండ్‌తో తలపడే వన్డే, టి20 పాకిస్తాన్ జట్లలో అతనికి స్థానం లభించింది. 24 ఏళ్ల ఆమిర్ పునరాగమనంపై అన్ని వైపులనుంచి విమర్శలు వచ్చినా... అతనికి గట్టిగా మద్దతు పలికిన పాక్ బోర్డు, ఇటీవలి ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని ఎంపికపై తమ వాదనను సమర్థించుకుంది.
ఆమిర్‌కు న్యూజిలాండ్ దేశం వీసా ఇవ్వడంపై అతని పర్య టన ఆధార పడి ఉంటుంది. వీసాకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే మాత్రం ఆమిర్ స్థానంలో ఇర్ఫాన్‌కు చోటు దక్కుతుంది. 2010లో లార్డ్స్ టెస్టులో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆమిర్ ఐదేళ్ల నిషేధం ఎదుర్కొనడంతో పాటు ఆరు నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఇటీవల సెప్టెంబర్‌లో అతడిపై నిషేధం ముగియడంతో పాక్ దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టి మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లోనూ రాణించాడు.