అమీర్‌ఖాన్‌కు ఆమె తెలియదా.? | Aamir Khan Fumbles On Question About Mithali Raj | Sakshi
Sakshi News home page

అమీర్‌ఖాన్‌కు భారత మహిళా క్రికెట్‌ కెప్టెన్‌ తెలియదా.?

Oct 14 2017 7:39 PM | Updated on Oct 14 2017 7:52 PM

 Aamir Khan Fumbles On Question About Mithali Raj

సాక్షి, హైదరాబాద్‌: భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ ఎవరు అని టీవీ వ్యాఖ్యాత అడిగిన ప్రశ్న బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది.  ఆమె పేరు నాకు తెలుసు కాకపోతే ఇప్పుడు గుర్తుకు రావడంలేదు’ అని అమీర్‌ బుకాయించాల్సిన పరిస్థితి హైదరాబాద్‌లోని ఉప్పల్‌ క్రికెట్‌ మైదానంలో చోటు చేసుకుంది.

భారత్‌-ఆసీస్‌ మధ్య చివరి టీ20కి హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మైదానం ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. కోహ్లి ఆహ్వానం మేరకు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఉప్పల్‌కి వచ్చిన అమీర్‌ఖాన్‌.. జైరా వశీంతో కలిసి మైదానంలో సందడి చేశారు. ఈ సందర్భంగా టీవీ వ్యాఖ్యాత జతిన్‌ సప్రూ, వీరేంద్ర సెహ్వాగ్‌లు వీరిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ట్రై బ్రేకర్‌ ప్రశ్న అంటూ ‘భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ ఎవరు’ అని ప్రశ్నించారు.

దీనికి అమీర్‌, జైరా సమాధానం చెప్పలేకపోయారు. నాకు తెలుసు కానీ ఇప్పుడు గుర్తుకురావడంలేదు’ అని ఆమీర్‌ అన్నాడు. భారత మహిళా క్రికెట్‌ జట్టును రెండు సార్లు ప్రపంచ కప్‌ ఫైనల్‌కు  చేర్చిన కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, అమీర్‌కు తెలియకపోవడం ఏమిటని నెటిజన్లు విస్మయం చెందుతున్నారు. అప్పటికీ సప్రూ వారికి కొన్ని సూచనలు ఇస్తున్నా ఫలితం లేకపోయింది. అవుట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారడంతో అంపైర్లు ఈ మ్యాచ్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement