ఈ టాప్ క్రికెటర్‌ను గుర్తుపట్టగలరా? | a famous cricketer in this pic: can u guess | Sakshi
Sakshi News home page

ఈ టాప్ క్రికెటర్‌ను గుర్తుపట్టగలరా?

Jan 1 2017 5:27 PM | Updated on Sep 5 2017 12:08 AM

ఈ టాప్ క్రికెటర్‌ను గుర్తుపట్టగలరా?

ఈ టాప్ క్రికెటర్‌ను గుర్తుపట్టగలరా?

ఫోటోలో ఉన్న ఇద్దరిలో ఓ ప్రముఖ క్రికెటర్ ఉన్నాడు.

న్యూఢిల్లీ: ఫోటోలో ఉన్న ఇద్దరిలో ఓ ప్రముఖ క్రికెటర్(ఎడమ వైపు) ఉన్నాడు. అతని స్పిన్ మాయజాలంతో భారత్కు ఎన్నో విజయాలను అందించాడు. ఇంకా గుర్తు పట్టలేదా అయితే మీకో హింట్. ఫోటోలో ఉన్న మరొకరు(కుడి వైపు) ఆ క్రికెటర్ గారాల కూతురు. అదేనండి.. నటి గీతా బస్రాను పెళ్లిచేసుకొని వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన హర్భజన్ సింగ్ గత ఏడాది జూలైలో తండ్రిగా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే.

అయితే భజ్జీ చిన్ననాటి ఫోటోతో పాటూ తన ముద్దుల కూతురు 'హినయ హీర్‌ ప్లహా' ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అప్పుడు నేను, ఇప్పుడు నా కూతురు ఒకేలా ఉన్నామా అంటూ కామెంట్ పెట్టాడు. మై యూనివర్స్, మై హ్యాప్పీనెస్, మై లైఫ్, హినయ హీర్‌ ప్లహా అంటూ ట్యాగ్స్ పెట్టి తన గారాలపట్టిపై తనకున్న ప్రేమను ఈ విధంగా చూపించాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement