
9వ ర్యాంకులో రహానే
భారత బ్యాట్స్‌మన్ అజింక్య రహానే ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌లో నాలుగు స్థానాలు కోల్పోరుు
దుబాయ్: భారత బ్యాట్స్‌మన్ అజింక్య రహానే ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌సలో నాలుగు స్థానాలు కోల్పోరుు తొమ్మిదో ర్యాంకులో నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలిటెస్టు రెండు ఇన్నింగ్‌సల్లోనూ రహానే విఫలమవడంతో ర్యాంకింగ్‌సలో దిగజారాడు. విరాట్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 14వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.
ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉండగా... జో రూట్ మూడు నుంచి రెండో ర్యాంకుకు ఎగబాకాడు. బౌలింగ్ విభాగంలో అశ్విన్‌దే అగ్రస్థానం కాగా... రవీంద్ర జడేజా ఏడో స్థానంలోనే నిలకడగా కొనసాగుతున్నాడు. టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్‌సలోనూ అశ్విన్‌దే టాప్ ర్యాంకు.