ఆసియా క్రీడలకు భారత్‌ నుంచి  36 క్రీడాంశాల్లో 572 మంది  | Sakshi
Sakshi News home page

ఆసియా క్రీడలకు భారత్‌ నుంచి  36 క్రీడాంశాల్లో 572 మంది 

Published Sat, Aug 11 2018 1:40 AM

572 out of 36 sports in India for Asian Games - Sakshi

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల సందర్భంగా మైదానంలో, బయటా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని భారత బృందానికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌ సూచించారు. ఈనెల 18 నుంచి సెప్టెంబరు 2 వరకు ఇండోనేసియాలోని జకార్తా, పాలెంబాంగ్‌లో జరిగే ఆసియా క్రీడల్లో భారత్‌ నుంచి 36 క్రీడాంశాల్లో 572 మంది క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు.

మరోవైపు ఈ క్రీడల్లో యువ జావెలిన్‌ త్రోయర్, కామన్వెల్త్‌ క్రీడల చాంపియన్‌ నీరజ్‌ చోప్రా మార్చ్‌పాస్ట్‌లో త్రివర్ణ పతాకధారిగా వ్యవహరించనున్నాడు. 20 ఏళ్ల నీరజ్‌ చోప్రా గతేడాది ఆసియా అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌లో, 2016 లో అండర్‌–20 ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ లో బంగారు పతకాలు సొంతం చేసుకున్నాడు.  

Advertisement
Advertisement