వారిలో 5 శాతం భారత ఆటగాళ్లే... | Sakshi
Sakshi News home page

వారిలో 5 శాతం భారత ఆటగాళ్లే...

Published Wed, Aug 5 2015 1:33 AM

5 per cent of the Indian players

 న్యూఢిల్లీ : ప్రపంచ అథ్లెటిక్స్ రంగాన్ని కుదిపేసిన ఇటీవలి బ్లడ్ డోపింగ్‌లో భారత ఆటగాళ్ల నమూనాలు కూడా ఉన్నాయని తేలింది. 5 వేల మంది అథ్లెట్లకు సంబంధించి 12 వేల రక్త నమూనాల్లో ఐదు శాతం భారత ఆటగాళ్లకు చెందినవేనని ఇంగ్లండ్‌కు చెందిన సండే టైమ్స్ పేర్కొంది. అయితే క్రీడా నిపుణులు మాత్రం ఈ విషయంలో సంశయం వ్యక్తం చేస్తున్నారు. ‘భారత్‌లో ఎరిత్రోపొయిటిన్ (ఈపీఓ) అందుబాటులోనే ఉంటుంది. ఒకవేళ ఈ కథనాలు నిజమే అనుకుంటే దీన్నే ఆటగాళ్లు తీసుకుని ఉంటారు.

అయితే భారత ఆటగాళ్ల గురించి వస్తున్న వార్తలు నిజమా.. కాదా నాకు తెలీదు. కానీ ఈపీఓ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇక్కడ బ్లడ్ డోపింగ్ లేదు అని మాత్రం చెప్పలేం’ అని స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు పీఎస్‌ఎం చంద్రన్ తెలిపారు. ఈ విషయంపై స్పందించేందుకు భారత అథ్లెటిక్స్ సమాఖ్య, నాడా అధికారులు అందుబాటులోకి రాలేదు. జాతీయ శిబిరాల్లో అథ్లెట్ల నుంచి చాలా అరుదుగా మాత్రమే నాడా రక్త నమూనాలను సేకరిస్తుందని మాజీ కోచ్ ఒకరు చెప్పారు.

Advertisement
Advertisement