ఈసారి విజేతకు spరూ. 28 కోట్లు 

$ 10 million prize pot for ICC Men's Cricket World Cup 2019 - Sakshi

 రన్నరప్‌ జట్టుకు రూ. 14 కోట్లు  

లండన్‌: వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌నకు సంబంధించిన ప్రైజ్‌మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) వెల్లడించింది. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ కోటి డాలర్లు (రూ. 70 కోట్లు). విజేత జట్టుకు 40 లక్షల డాలర్లు (రూ. 28 కోట్లు) లభిస్తాయి. రన్నరప్‌ జట్టు 20 లక్షల డాలర్లు (రూ. 14 కోట్లు) సొంతం చేసుకుంటుంది. సెమీఫైనల్స్‌లో ఓడిన రెండు జట్లకు 8 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 61 లక్షలు) చొప్పున అందజేస్తారు.

లీగ్‌ దశలో ఒక్కో విజయానికి 40 వేల డాలర్ల (రూ. 28 లక్షలు) చొప్పున ఇస్తారు. లీగ్‌ దశ ముగిశాక టాప్‌–6లో నిలిచిన జట్లకు లక్ష డాలర్ల (రూ. 70 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభిస్తుంది. మే 30 నుంచి జూలై 14 వరకు 46 రోజులపాటు ఇంగ్లండ్‌లోని 11 వేదికల్లో ఈ మెగా టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. 2015 ప్రపంచకప్‌తో పోలిస్తే ఈసారి విజేత, రన్నరప్‌ జట్లకు 2 లక్షల 50 వేల డాలర్ల చొప్పున ఎక్కువ ప్రైజ్‌మనీ లభించనుంది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top