ఊర మాస్‌గా విజయ్‌ | vijay mass action in super good films | Sakshi
Sakshi News home page

ఊర మాస్‌గా విజయ్‌

Jan 29 2018 6:53 AM | Updated on Aug 20 2018 3:40 PM

vijay mass action in super good films - Sakshi

తమిళసినిమా: విజయ్‌ అంటేనే మాస్, మాస్‌ అంటేనే విజయ్‌ అన్నంతగా ఆయన చిత్రాలు ఉంటాయి. అభిమానుల నాడిని బట్టే స్టార్‌ హీరోలు కథలను ఎంచుకుంటారు. ఇక విజయ్‌ అభిమానులు ఆయన్ని మాస్‌ హీరోగానే చూడటానికి ఇష్టపడతారు. విజయ్‌ ఈ మధ్య నటించిన తుపాకీ, జిల్లా, కత్తి, తెరి, మెర్శల్‌ చిత్రాలన్నీ ఈ తరహా కథా చిత్రాలే. మెర్శల్‌ చిత్రంలో మూడు పాత్రల్లో ముగ్గురు కథానాయికలతో దుమ్మురేపారు. శ్రీ తేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఆ సంస్థలో 100వ చిత్రంగా నమోదైంది. తాజాగా విజయ్‌ ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో తన 62వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కీర్తీసురేశ్‌ నాయకి. మురుగదాస్, విజయ్‌ల కాంబినేషన్‌ అంటేనే ఒక స్పెషల్‌.

వీరి కలయికలో తెరకెక్కిన తుపాకీ, కత్తి చిత్రాలు విశేష ప్రేక్షకాదరణను పొందాయన్నది గమనార్హం. విజయ్‌ 62వ చిత్రం షూటింగ్‌ దశలో ఉండగానే తదుపరి చిత్రానికి పచ్చజెండా ఊపారన్నది తాజా సమాచారం. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌లో విజయ్‌ తన 63వ చిత్రాన్ని చేయనున్నారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉన్నా, ఇది సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ సంస్థకు 100వ చిత్రం కావడం మరో విశేషం. అయితే ఇందులో విజయ్‌ ఊర మాస్‌ పాత్రలో నటించనున్నారని సమాచారం. ఇక ఆయన అభిమానులకు పండగేనని వేరే చెప్పాలా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement