‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను మించిన వెన్నుపోటు’

Viral Video In Social Media Over Vennupotu In Cricket Match - Sakshi

హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ‘వెన్నుపోటు’ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడే. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడి​చి టీడీపీని, అధికారాన్ని చంద్రబాబు హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే కథాంశంతోనే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దివంగత సీఎం ఎన్టీఆర్‌ను హైదరాబాద్‌లోని వైస్రాయ్‌ హోటల్‌ సాక్షిగా చంద్రబాబు ఎలా అవమానానికి గురిచేశారు.. టీడీపీని, అధికారాన్ని ఎలా హస్తగతం చేసుకున్నారో ఈ చిత్రంలో చూపించనున్నారు వర్మ. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంతో ప్రస్తుతం ‘వెన్నుపోటు’అంశం ట్రెండ్‌లో ఉండగానే మరో వెన్నుపోటు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. (లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ : సోషల్‌ మీడియాలో వైస్రాయ్‌ సీన్‌)

ఓ క్రికెట్‌ మ్యాచ్‌ సందర్బంగా సహచర ఆటగాడినే మరో బ్యాట్స్‌మెన్‌​ రనౌట్‌ చేయిస్తాడు. బౌలర్‌ వేసిన బంతిని బ్యాట్స్‌మన్‌ డిఫెన్స్‌ ఆడి పరుగుకు పిలుస్తాడు. వెంటనే నాన్‌ స్ట్రైక్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ పరుగు కోసం యత్నించాడు. వెంటనే డిఫెన్స్‌ ఆడిన బ్యాట్స్‌మన్‌ బంతిని బౌలర్‌కు అందించి సహచర ఆటగాడు రనౌట్‌లో భాగస్వామ్యమవుతాడు.  దీంతో సొంత జట్టు ఆటగాడి చర్యతో షాక్‌కు గురైన బ్యాట్స్‌మన్‌ అసహనంతో క్రీజు వదిలి వెళ్లాడు. ప్రసుతం దీనికి సంబంధించిన వీడియా నెట్టింట్లో తెగ హల్‌ చల్‌ చేస్తోంది. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను మించిన వెన్నుపోటు ఇది’అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ‘రాజకీయాల్లోనే కాదు క్రీడల్లోనూ వెన్నుపోటు ఉంటుందని నిరూపించావ్‌ బ్రదర్‌’అంటూ వ్యంగ్యంగా పేర్కొంటున్నారు. 
(ఎన్టీఆర్ సం‍దేశం.. ‘వాడు గాడ్సే కన్నా అధముడు)

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top