అడవైనా.. రోడ్డైనా రాజు మాత్రం నేనే..!

Viral Video Four Lions Take Over Busy Road - Sakshi

సింహాన్ని జూలో చూడాలంటేనే చాలా మందికి వణుకోస్తుంది. అలాంటిది ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు సింహాలు అలా రోడ్డు మీద కార్ల మధ్యలోంచి దర్జగా నడుచుకుంటూ వెళ్తుంటే ఎలా ఉంటుంది.. ఇదిగో ఈ వీడియోలో ఉన్నట్లు ఉంటుంది. ఈ సంఘటన దక్షిణాఫ్రికాలోని క్రూగర్‌ నేషనల్‌ పార్క్‌లో చోటు చేసుకుంది ఈ సంఘటన. దాదాపు 30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో నాలుగు సింహాలు దర్జాగా రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్లాయి. ఆ సమయంలో అక్కడ రోడ్డు మీద దాదాపు పదుల సంఖ్యలో కార్లున్నాయి.

కానీ వారంతా మృగరాజులు వెళ్లే వరకూ ఆగి ఆ తర్వాత ముందుకు సాగారు. సింహన్ని జూలో చూడటం కన్నా ఇలా నడిరోడ్డు మీద నడిచి వెళ్తూంటే చూడటం నిజంగా చాలా థ్రిల్‌ని కలిగించిందంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే ఈ వీడియోను దాదాపు 20 లక్షల మంది చూశారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top