వైరల్‌... బాలీవుడ్‌ అంటే మాకూ ప్రేమే! | US Embassy staff mimicking Hindi movie dialogues | Sakshi
Sakshi News home page

వైరల్‌ : అమెరికన్లు బాలీవుడ్‌ అడిషన్లకు వస్తే...

Sep 29 2017 10:36 AM | Updated on Apr 3 2019 6:34 PM

US Embassy staff mimicking Hindi movie dialogues - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అగ్రరాజ్యం అమెరికాకు భారత దేశానికి మధ్య బంధం ఎంత బలంగా ఉంటుందో తెలియంది కాదు. కీలక ఒప్పందాలతో ఇరు దేశాలు పరస్పర సహకారం అందించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే అమెరికన్ల నోట బాలీవుడ్‌ డైలాగులు చెబితే ఎలా ఉంటుందోనన్న ఓ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్‌ అవుతోంది. 

న్యూఢిల్లీలోని యూఎస్‌ రాయబార కార్యాలయం తన ట్విట్టర్‌లో నిన్న ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ఎంబసీ అధికారులంతా కలిసి బాలీవుడ్‌ అడిషన్లకు హాజరైతే ఎలా ఉంటుంది అన్నదే ఆ వీడియో. కళాఖండ చిత్రం ‘షో’లోని గబ్బర్‌ సింగ్‌ నోటి నుంచి వచ్చే పాపులర్‌ డైలాగ్‌ అరే వో సాంబా కిత్‌నే ఆద్మీ తే.. డైలాగును ఓ పెద్దాయన కిత్‌నే ఆద్మీ తే అంటూ కొరడా ఝుళిపించి చెప్పారు. ఇక షారూఖ్‌ ఓం శాంతి ఓం లోని ఏక్‌ చుట్కీ సింధూర్‌ డైలాగ్‌ను ఓ మహిళా ఉద్యోగితో చెప్పించారు. నమక్‌ హలాల్‌, దీవార్‌ చిత్రాల్లోని పాపులర్‌ డైలాగులను కూడా వాళ్లు అవలీలగా చెప్పేశారు. 

వీ లవ్‌ బాలీవుడ్‌ అంటూ ఫన్నీ అడిషన్‌ వీడియోను యూఎస్‌ఇండియాదోస్తీ హ్యాష్‌ట్యాగ్‌తో షేర్‌ చేయగా ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది. పాపం హిందీ డైలాగులు చెప్పేందుకు వాళ్లు పడ్డ కష్టాన్ని గుర్తించిన పలువురు సోషల్‌ మీడియాలో అభినందనలు తెలియజేస్తూనే.. నెక్స్ట్‌ తమిళ డైలాగులు.. అది కూడా రజనీ స్టైల్లో చెప్పండంటూ సలహాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement