రష్యాపై ఆంక్షల సడలింపు చారిత్రాత్మకం: పుతిన్ ప్రతినిధి | Putin envoy hails Trump move for Easing of sanctions on Russia | Sakshi
Sakshi News home page

రష్యాపై ఆంక్షల సడలింపు చారిత్రాత్మకం: పుతిన్ ప్రతినిధి

Oct 17 2026 5:36 PM | Updated on Oct 17 2026 6:07 PM

Putin envoy hails Trump move for Easing of sanctions on Russia

రష్యాపై కొత్తగా విధించాల్సిన కొన్ని ఆంక్షలను సడలిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతినిధి కిరిల్ దిమిత్రియేవ్ స్వాగతించారు. ఈ నిర్ణయం చారిత్రాత్మకమని ఆయన అభివర్ణించారు. ఆంక్షలు, ఘర్షణలకు బదులుగా చర్చలు, ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని తన Xలో ఖాతాలో పేర్కొన్నారు.

రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధించేందుకు వీలు కల్పించే చట్టం అమలుకు ముందు ట్రంప్ కీలక ఆంక్షల నుంచి మినహాయింపునిస్తూ ఈ ఉత్తర్వుపై సంతకం చేశారు.

ఇటీవల పుతిన్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం రష్యా భారీ మొత్తంలో డీజిల్‌ను అంతర్జాతీయ మార్కెట్‌కు సరఫరా చేయనుందని ట్రంప్ వెల్లడించారు. అయితే ఈ ఒప్పందం రష్యాకు ప్రయోజనం చేస్తూ, ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగించేందుకు సహకరిస్తుందని అమెరికాలోని పలువురు రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు.

ఇదిలా ఉండగా మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వచ్చే ఏడాది తమ దేశానికి దాదాపు 80 బిలియన్ డాలర్ల అదనపు ఆర్థిక సాయం అందించాలని యూరోపియన్ యూనియన్ నేతలను కోరారు.

ఇదీ చదవండి: పిల్లలకూ ఇంటర్నెట్ హక్కు.. వయసు ఆధారిత నిషేధానికి 'సుప్రీం' నో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement