పిల్లలకూ ఇంటర్నెట్ హక్కు.. వయసు ఆధారిత నిషేధానికి 'సుప్రీం' నో | Supreme Court says no to age-based ban Right to Internet for Children | Sakshi
Sakshi News home page

పిల్లలకూ ఇంటర్నెట్ హక్కు.. వయసు ఆధారిత నిషేధానికి 'సుప్రీం' నో

Oct 17 2026 4:20 PM | Updated on Oct 17 2026 4:33 PM

Supreme Court says no to age-based ban Right to Internet for Children

సాక్షి,న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌ను వినియోగించే హక్కు పిల్లలతో సహా ప్రతి ఒక్క వ్యక్తికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 19(1)(a) ప్రకారం ఇంటర్నెట్‌ వాడటం ప్రాథమిక హక్కు అని కోర్టు పేర్కొంది. పిల్లల వయసు ఆధారంగా ఇంటర్నెట్ వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించేందుకు నిరాకరించింది.

జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా వేదికల్లో పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ వ్యాప్తిని అరికట్టడంలో నిర్లక్ష్యం జరుగుతోందన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ అభిప్రాయాన్ని వెల్లడించింది.

పిల్లల భద్రతతో పాటు వారి స్వేచ్ఛ కూడా ముఖ్యమేనని కోర్టు పేర్కొంది. ఇంటర్నెట్‌పై నిషేధం విధించడం కంటే తల్లిదండ్రుల నియంత్రణలు, సోషల్ మీడియాలో చైల్డ్ మోడ్, అభ్యంతరకర కంటెంట్ తొలగింపు వంటి చర్యలను కఠినంగా అమలు చేయాలని సూచించింది.

పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను గుర్తించి తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ డేటాబేస్‌ను రూపొందించాలని ఆదేశించింది. అలాంటి కంటెంట్‌కు సంబంధించిన URL, డిజిటల్ గుర్తింపులను నమోదు చేసి, వాటి వ్యాప్తిని అడ్డుకునేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని స్పష్టం చేసింది.

పిల్లల రక్షణ విషయంలో అధికారులు, సోషల్ మీడియా సంస్థలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని ధర్మాసనం పేర్కొంది. పిల్లలకు సురక్షితమైన ఇంటర్నెట్‌ అందించడంతోపాటు, వారి ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: నితీశ్ కుమార్‌కు ఎలాంటి నేరస్తులతోనూ సంబంధాలు లేవు : జేడీయూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement