వైరలవుతోన్న కవల పిండాల క్యూట్‌ ఫైట్‌

Unborn Twin Sisters Box it Out in Mom Womb - Sakshi

బీజింగ్‌ : తోబుట్టువుల మధ్య పోట్లాట అనేది సహజం. ప్రతీ విషయానికి గొడవపడటం.. కొట్టుకోవటం కూడా కామనే. ఇదంతా బయట అంటే వారు పుట్టాక జరుగుతుంది. కానీ ఈ వీడియో చూస్తే.. తల్లి గర్భంలోనే ఈ తగదా ప్రారంభమవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా పూర్తిగా నెలలు కూడా నిండని ఇద్దరు కవలలు అమ్మ పొట్టలోనే కిక్‌బాక్సింగ్‌ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ కవల పిండాల దెబ్బలాటకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. వివరాలు.. చైనాకు చెందిన ఓ మహిళ నాలుగో నెలల గర్భంతో ఉండగా వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు ఆమెకు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేశారు.

ఈ సమయంలో ఆమె గర్భంలో ఉన్న ఇద్దరు కవలలు ఒకరితో ఒకరు ఫైటింగ్‌ చేస్తూ కనబడ్డారు. అక్కడే ఉన్న ఆమె భర్త దీన్నంతా వీడియో తీశాడు. అనంతరం దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవ్వడమే కాక అనేక ప్రశంసలు అందుకుంటుంది. ‘తల్లి గర్భంలోనే ఇలా పోట్లాడుకుంటున్నారు.. ఇక బయటకు వచ్చాక ఇంకెంత తన్నుకుంటారో’.. ‘ఖచ్చితంగా బాక్సర్లే అవుతారు’ అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top