మీరా.. ఇది దీపావళి.. హనీమూన్‌ కాదు! | Trolls On Shahid and Mira Share Steamy kiss | Sakshi
Sakshi News home page

Nov 9 2018 11:01 AM | Updated on Nov 9 2018 11:06 AM

Trolls On Shahid and Mira Share Steamy kiss - Sakshi

మీరాకపూర్‌ షేర్‌ చేసిన ఫొటో

దీపావళికి, వాలెంటైన్స్‌డేకు వ్యత్యాసం లేకుండా పోయిందని..

ముంబై : టాలీవుడ్‌ సెన్సేషన్‌ అర్జున్‌ రెడ్డి హిందీ రిమేక్‌లో నటిస్తున్న బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ను ఆ పాత్ర ఆవహించినట్టుంది. చిత్ర షూటింగ్‌లో హీరోయిన్‌కు లిప్‌లాక్స్‌ ఇచ్చి అలవాటైన ఈ హిందీ అర్జున్‌ రెడ్డి ఇంట్లోను తన భార్యకు లిప్‌లాక్స్‌ ఇస్తున్నాడు. ఈ ఫొటోలను అతని సతీమణి మీరా కపూర్‌ ‘ప్రేమ ఒక్కటే.. హ్యాపీ దీపావళి’ అనే క్యాప్షన్‌తో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఈ విషయం తెలిసింది. ఇక ఈ లిప్‌లాక్‌ ఫొటోలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ జంటను సమర్ధిస్తుంటే మరికొందరు మండిపడుతున్నారు. 

‘ఇది దీపావళి.. హనీమూన్‌ కాదు’ అని ఒకరంటే.. ‘ఇది థర్డ్‌ క్లాస్‌ దీపావళి.. మీ చర్యతో సిగ్గుపడుతున్నా’ అని మరొకరు ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. దేశ సంప్రదాయాన్ని గంగలో కలుపుతున్నారని, దీపావళికి, వాలెంటైన్స్‌డేకు వ్యత్యాసం లేకుండా పోయిందని ఇంకొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  దీంతో ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇక ఈ లిప్‌లాక్‌కు 4లక్షలకు పైగా లైక్స్‌రాగా.. వేల కాంప్లిమెంట్స్‌ వచ్చాయి. 

Only love 💕Happy Diwali!

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement