తండ్రి కోసం హాస్పిటల్‌లో పెళ్లి.. నెటిజన్ల ఫిదా ! | A Texas Couple Married in the Hospital for Their Father | Sakshi
Sakshi News home page

తండ్రి కోసం హాస్పిటల్‌లో పెళ్లి.. నెటిజన్ల ఫిదా !

Nov 14 2019 9:30 PM | Updated on Nov 15 2019 2:59 PM

A Texas Couple Married in the Hospital for Their Father - Sakshi

ఆసుపత్రిలో పెళ్లి చేసుకుంటున్న అమెరికన్‌ జంట

న్యూయార్క్‌ : పెళ్లి చేసుకోబోయే ఓ జంట, పెళ్లి కొడుకు తండ్రి ఆసుపత్రిలో ఉన్నాడని, అక్కడే తండ్రి సమక్షంలో పెళ్లి  చేసుకున్నారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఆలియా, మైకేల్‌ థామ్సన్‌ అనే జంట మార్చిలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వివాహ తేదీ సమీపించే కొద్దీ ఇద్దరు వరుడి తరపు సమీప బంధువులు చనిపోవడంతో వివాహం వాయిదా వేశారు. అనంతరం చనిపోయిన బంధువులను తలుచుకుంటూ మంచం పట్టిన తండ్రి ఆసుపత్రి పాలయ్యాడు. ఈ నేపథ్యంలో పెళ్లి వాయిదా వేయకుండా, పెళ్లికి తండ్రి మిస్‌ అవకుండా ఉండాలని ఆలోచించిన మైకేల్‌ తనకొచ్చిన ఆలోచనను పాస్టర్‌తో పంచుకున్నాడు.

దీనికి చర్చి పాస్టర్‌ కూడా ఒప్పుకోవడంతో తండ్రి సమక్షంలో గురువారం ఆసుపత్రిలో ఈ వివాహం జరిపించారు. ఆసుపత్రి వాతావరణానికి తగ్గట్టు వధూవరులిద్దరూ నర్సులు ధరించే దుస్తులనే ధరించారు. ఉంగరాలు మార్చుకునేటప్పుడు చేతికున్న గ్లౌజు మీదుగానే ధరించారు. ఈ పెళ్లికి అక్కడి సిబ్బంది మనస్పూర్తిగా సహకరించగా, ఆసుపత్రిలోని డాక్టర్‌ కేక్‌ తెప్పించారు. ఈ పెళ్లి ఫోటోలు ఇప్పుడు ఫేస్బుక్‌లో వైరల్‌గా మారాయి. కాగా, ఆసుపత్రిలో పెళ్లి చేసుకొని కొత్త సాంప్రదాయానికి తెరతీశారంటూ పలువురు నెటిజన్లు ఈ జంటను అభినందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement