breaking news
Marriage in Hospital
-
తండ్రి కోసం హాస్పిటల్లో పెళ్లి.. నెటిజన్ల ఫిదా !
న్యూయార్క్ : పెళ్లి చేసుకోబోయే ఓ జంట, పెళ్లి కొడుకు తండ్రి ఆసుపత్రిలో ఉన్నాడని, అక్కడే తండ్రి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఆలియా, మైకేల్ థామ్సన్ అనే జంట మార్చిలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వివాహ తేదీ సమీపించే కొద్దీ ఇద్దరు వరుడి తరపు సమీప బంధువులు చనిపోవడంతో వివాహం వాయిదా వేశారు. అనంతరం చనిపోయిన బంధువులను తలుచుకుంటూ మంచం పట్టిన తండ్రి ఆసుపత్రి పాలయ్యాడు. ఈ నేపథ్యంలో పెళ్లి వాయిదా వేయకుండా, పెళ్లికి తండ్రి మిస్ అవకుండా ఉండాలని ఆలోచించిన మైకేల్ తనకొచ్చిన ఆలోచనను పాస్టర్‌తో పంచుకున్నాడు. దీనికి చర్చి పాస్టర్ కూడా ఒప్పుకోవడంతో తండ్రి సమక్షంలో గురువారం ఆసుపత్రిలో ఈ వివాహం జరిపించారు. ఆసుపత్రి వాతావరణానికి తగ్గట్టు వధూవరులిద్దరూ నర్సులు ధరించే దుస్తులనే ధరించారు. ఉంగరాలు మార్చుకునేటప్పుడు చేతికున్న గ్లౌజు మీదుగానే ధరించారు. ఈ పెళ్లికి అక్కడి సిబ్బంది మనస్పూర్తిగా సహకరించగా, ఆసుపత్రిలోని డాక్టర్ కేక్ తెప్పించారు. ఈ పెళ్లి ఫోటోలు ఇప్పుడు ఫేస్బుక్లో వైరల్‌గా మారాయి. కాగా, ఆసుపత్రిలో పెళ్లి చేసుకొని కొత్త సాంప్రదాయానికి తెరతీశారంటూ పలువురు నెటిజన్లు ఈ జంటను అభినందిస్తున్నారు. -
ఆస్పత్రిలో పెళ్లాడిన జంట
రాయపూర్: కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. ఈ విషయాన్ని మరోమారు రుజువు చేసింది ఛత్తీస్‌గఢ్‌లోని ఓ జంట. విధి తమతో ఆడుకున్నా లెక్కచేయకుండా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఆస్పత్రినే కళ్యాణమండపంగా చేసుకుని వివాహం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన వరుణ్ బాగ్(22)కు రూపాలి(22) అనే యువతితో పెళ్లి కుదిరింది. అక్షీయ తృతీయ రోజున పెళ్లి నిర్ణయమైంది. అయితే రూపాలికి కామెర్లు సోకడంతో ఆమె డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ మెడికల్ ఆస్పత్రిలో చేరింది. వీరి వివాహం ఆస్పత్రిలో జరిపించేందుకు యాజమాన్యం ముందుకు రావడంతో రూపాలిని వీల్ చైర్లోనే ఉండగానే వరుణ్ పెళ్లాడాడు. ఆస్పత్రిలోని మహిళల అవార్డు వేద మంత్రాలతో మార్మోగింది. ఆస్పత్రి సిబ్బంది, బంధువుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. అయితే రూపాలికి ఇది ద్వితీయ వివాహం. రెండేళ్ల క్రితం ఆమెకు మొదట వివాహం జరిగింది. అయితే పెళ్లైన పది నెలలకే ఆమె మొదటి భర్త చనిపోయాడు. తమ పెళ్లి ఆస్పత్రిలో జరగడం పట్ల రూపాలి, వరుణ్ సంతోషం వ్యక్తం చేశారు.