స్వరాభాస్కర్‌లా చేయకండి! | Swara Bhasker Fires Trolls for Using her Veere Di Wedding Masturbation Scene on Poll Placards | Sakshi
Sakshi News home page

స్వరాభాస్కర్‌లా చేయకండి!

Apr 30 2019 3:57 PM | Updated on Apr 30 2019 6:44 PM

Swara Bhasker Fires Trolls for Using her Veere Di Wedding Masturbation Scene on Poll Placards - Sakshi

స్వరాభాస్కర్‌లా స్వయం సంతృప్తి కోసం కాకుండా మీ వేలును ఓటు వేయడానికి ఉపయోగించండి.. 

ఈ ఎన్నికల్లో స్వరాభాస్కర్‌లా కాకుండా మీ వేలును ఓటు వేయడానికి ఉపయోగించండి అంటూ ఇద్దరు వ్యక్తులు ప్లకార్డులతో చేపట్టిన ప్రచారం సోషల్‌మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. తన గురించి చేస్తున్న ప్రచారంపై బాలీవుడ్‌ నటి స్వరభాస్కర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్విటర్‌ వేదికగా ఆ ఇద్దరిపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ‘వారెవ్వా.. నా ట్రోలర్స్‌ ఇంత ఎండలో కూడా తెగ కష్టపడుతూ.. నా పాపులారిటీ కోసం చెమటను చిందిస్తున్నారు. గాయ్స్‌ మీ అంకితభావం ఎంతో సంతోషాన్నిస్తుంది.’ అని సెటైరిక్‌గా ట్వీట్‌ చేసింది. 

ఇ​క స్వరా గతేడాది వచ్చిన ‘వీరే ది వెడ్డింగ్‌’ చిత్రంలో స్వయం సంతృప్తికి సంబంధించిన సన్నివేశంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సీన్‌పై అప్పట్లోనే పెద్ద రచ్చ కాగా.. తాజాగా ఎన్నికలకు ముడిపెడుతూ ప్లకార్డులు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. ఆ చిత్రం డిమాండ్‌ మేరకు స్వరా ఆ సన్నివేశంలో నటించిందని, ఇప్పుడు ఆ సన్నివేశం ప్రస్తావించడం సబబు కాదని కొందరు ఆమెకు మద్దుతు తెలుపుతుండగా.. ఇది భారత సంస్కృతి విరుద్దమని, అలాంటి సన్నివేశంలో ఎలా నటిస్తుందని మరొకరు విమర్శిస్తున్నారు. ఎవరెన్ని అన్నా హేటర్స్‌ అంతా నన్ను ప్రేమించేవారేనని స్వరా అభిప్రాయపడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement