భీకరపోరులో ఓడిందెవరు? | Snake wraps its long body around a 2ft-long iguana | Sakshi
Sakshi News home page

భీకరపోరులో ఓడిందెవరు?

Oct 31 2017 12:37 PM | Updated on Oct 31 2017 4:02 PM

Snake wraps its long body around a 2ft-long iguana

వెబ్‌ డెస్క్‌ : ఓ గోల్ఫ్‌ కోర్సులో పాము, ఇగువానాల మధ్య జరిగిన భీకర పోరులో పాము విజయం సాధించింది. ఐదు నిమిషాల పాటు సాగిన ఈ పోరులో పాము ఇగువానాను మింగేసింది. ఈ సంఘటన థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో చోటు చేసుకుంది. మైదానం వెళ్తున్న ఇగువానాను చూసిన గోల్డెన్‌ ట్రీ స్నేక్‌ దాన్ని చుట్టి మింగేయబోయింది.

ఇగువానా ప్రతిఘటించడంతో రెండిటి మధ్య భీకర పోరు జరిగింది. ఆ సమయంలో గోల్ఫ్‌ కోర్సులో ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని చిత్రీకరించారు. కొద్దిసేపటి తర్వాత రెండు అడుగుల పొడవున్న ఇగువానాను పాము మింగేసిందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement