చైనీస్‌ మంజా ఎఫెక్ట్‌ను కళ్లకు కడుతున్న ఫోటో

Parrot Killed By The String Of A Kite - Sakshi

న్యూఢిల్లీ : సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి రంగురంగుల ముగ్గులు, పిండి వంటలు, గంగిరెద్దులు, హరిదాసు, గాలిపటాలు‌. ఎక్కెడెక్కడో ఉన్న వారంతా పల్లేలకు చేరుకుని సంతోషంగా గడుపుతారు. కానీ మన సంతోషం పక్షుల పాలిట యమపాశమవుతోంది. గాలిపటాల పేరుతో పక్షులకు ఉరితాళ్లు బిగిస్తున్నాం. గాలిపటం మంజా తగిలి మృతి చెందిన ఓ రామచిలుక ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. బిదితా బాగ్‌ అనే ట్విటర్‌ యూజర్‌ ఒకరు.. మంజా తగిలి చనిపోయిన  రామ చిలుక ఫోటోను ట్వీట్‌ చేశారు.

‘కాయ్‌పో చీ’ అనే క్యాప్షన్‌తో ఫోటోను పోస్ట్‌ చేయడమే కాక.. ‘వందలాది పక్షులు ఈ కైట్‌ ఫెస్టివల్‌ మూలంగా ప్రాణాలు కోల్పోతున్నాయి. దయచేసి చైనీస్‌ మంజా వాడకాన్ని నిలిపివేయండి’ అంటూ ట్వీట్‌ చేశారు. చైనీస్ మంజా దారానికి చిక్కి ప్రాణాలు కోల్పోయిన రామచిలుక ఎంత విలవిలలాడి ఉంటుందోనని పక్షి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు ‘ఫోటోకు తగ్గ క్యాప్షనే పెట్టారు నిజంగానే  రామ చిలుక కాయ్‌పో చీ’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

‘కాయ్‌పో చీ’ అనేది గుజరాతి పదం. గాలిపటాల ఎగరేసేటప్పుడు ఈ పదాన్ని ఎక్కువగా వాడతారు. అవతలి వారి గాలిపటాన్ని కట్‌ చేస్తే కాయ్‌పో చీ అంటారు. నిషేధిత చైనా మంజా వల్ల పక్షులే కాక మనుషులు కూడా మృత్యువాత పడ్డారు. మంజా వల్ల గొంతు తెగి ఓ ఎనిమిదేళ్ల బాలుడు మరణించిన సంగతి తెలిసిందే.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top