పాక్‌ జెండా.. బెస్ట్‌ టాయిలెట్‌ పేపరంట! | Pakistan Flag is Best Toilet Paper in World | Sakshi
Sakshi News home page

పాక్‌ జెండా.. బెస్ట్‌ టాయిలెట్‌ పేపరంట!

Feb 17 2019 6:29 PM | Updated on Feb 17 2019 6:29 PM

Pakistan Flag is Best Toilet Paper in World - Sakshi

అవును గూగులమ్మ ఇదే చెబుతోంది. ‘‘Best toilet paper in the world’

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచంలోనే అత్యుత్తమ టాయిలెట్ పేపర్ పాకిస్తాన్ జాతీయ జెండానేనట. అవును గూగులమ్మ ఇదే చెబుతోంది. ‘‘Best toilet paper in the world’  అని టైప్ చేస్తే.. పాకిస్తాన్ జాతీయ పతాకమే కనిపిస్తోంది. ఇంకేముంది.. పుల్వామా ఉగ్రదాడితో ఉడికిపోతున్న మనోళ్లకు మంచి అవకాశం దొరికింది. వెంటనే వాటి స్క్రీన్‌ షాట్లు తీసి పక్కదేశంపై కుళ్లు జోకులు పేల్చారు. అంతేకాకుండా వాటిని మీరు చూడండని నెట్టింట పెట్టారు. ‘Best toilet paper in the world’ అని టైప్ చేసి.. ఇమేజ్ ఆప్షన్ నొక్కితే పాకిస్తాన్ జాతీయ జెండా వస్తుందని, చూసి ఎంజాయ్ చేయండి అంటూ సోషల్ మీడియాలో హోరెత్తించారు. ఈ విషయం తెలసుకున్న గూగులమ్మ నిర్వాహకులు తప్పిదాన్ని సరిదిద్దుకున్నారు. కానీ నెటిజన్స్ సేవ్ చేసిన స్క్రీన్ షాట్లు మాత్రం ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement