బాత్‌రూంకు బయోమెట్రిక్‌ !

Netizens Funy Reactions as Pakistan Gets VVIP Toilets - Sakshi

ఇస్లామాబాద్‌ : వీవీఐపీ సంస్కృతికి స్వస్తీ పలుకుతూ.. నయా పాకిస్తాన్‌ను నిర్మిస్తామనే హామీతో మాజీ క్రికెటర్‌ కమ్‌ పొలిటిషియన్‌ ఇమ్రాన్‌ఖాన్‌ అధికారం చేపట్టారు. అయితే ఆయన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఆ దిశగా అడుగులు వేయకుండా.. వీవీఐపీ టాయిలెట్స్‌కు శ్రీకారం చుట్టింది. పరిశ్రమల మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఈ వీవీఐపీ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేసింది. టాయిలెట్‌ ముందు బయోమెట్రిక్‌ మిషన్‌ ఏర్పాటు చేసి ఉన్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఈ వీవీఐపీ బాత్‌రూమ్స్‌ను అడిషనల్‌ సెక్రటరీ లేక ఆ స్థాయి హోదా కలిగిన అధికారులు మాత్రమే ఉపయోగించాలని ది ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ పేర్కొంది. అదే హోదా కలిగిన ఇతర మంత్రిత్వశాఖల అధికారులు కూడా ఈ టాయిలెట్స్‌ను వాడుకోవచ్చిన తెలిపింది. అయితే ఈ వీవీఐపీ టాయిలెట్స్‌పై సోషల్‌ మీడియా వేదికగా జోకులు పేలుతున్నాయి. ఇంకా నయం వీవీఐపీ పేరిట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని ఒకరంటే.. ఇమ్రాన్‌ చెప్పిందేంటి ఆయన ప్రభుత్వం చేస్తుందేంటి? అని మరొకరు మండిపడుతున్నారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top