ప్రిడేటర్‌ పార్కులో సింహం పంజా.. | Lion Attacks Man in Predator Park | Sakshi
Sakshi News home page

ప్రిడేటర్‌ పార్కులో సింహం పంజా..

May 2 2018 10:59 AM | Updated on May 3 2018 10:49 AM

Lion Attacks Man in Predator Park - Sakshi

వ్యక్తిపై సింహం దాడి చేస్తున్న దృశ్యం

కేప్‌టౌన్ : అనుకోకుండా స్థావరం వైపు వెళ్లిన వ్యక్తిపై సింహం దాడికి పాల్పడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దక్షిణాఫ్రికాలోని ప్రిడేటర్‌ జాతీయ పార్కులో ఓ వ్యక్తి దారి తప్పి వన్య ప్రాణుల పార్క్‌లోని సింహం ఎన్‌క్లోజర్‌లోకి వచ్చాడు. పారిపోతున్న అతడిని వెంబడించిన సింహం దాడి చేసింది. గత నెల 28న సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. వీడియోలో ప్రకారం.. ఓ వ్యక్తి సింహం ఎన్‌క్లోజర్‌లోకి అకస్మాత్తుగా వచ్చాడు. ముందు సింహం ఉన్న చోటుకి ఎదురుగా వెళ్లాడు. అంతలోనే వెనక్కు పరుగెత్తుతూ కనిపించాడు.

ఏం జరుగుతోంది అని తెలుసుకునే లోపే ఓ సింహం అతడిని తరమడం ప్రారంభించింది. ప్రాణ భయంతో అతను ‘కాపాడండి.. కాపాడండి’ అంటా అరవడం ప్రారంభించాడు. అతనిపై ఒక్కసారిగా విరుచుకుపడిన సింహం తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement