అతడు గ్లాస్‌ తిప్పుతుంటే చూడాలి..

Kerala Man Shows Bartending Skills Viral Video - Sakshi

సోషల్‌మీడియాలో నయా సంచలనం 'టిక్ టాక్' వినోదానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఈ వీడియో షేరింగ్‌ యాప్‌ ద్వారా పలువురు తమలోని కళలను వివిధ రూపాలలో ఇతరులతో పంచుకుంటున్నారు. ఈ యాప్‌తో పలువురు చిన్నపాటి స్టార్‌లుగా మారిపోతున్నారు. కొందరికైతే విపరీతమైన పాపులారిటీ వచ్చింది. వీడియో నచ్చితే చాలు నెటిజన్లు విపరీతంగా షేర్‌ చేస్తున్నారు.

తాజాగా కేరళలో రోడ్‌సైడ్‌ స్టాల్‌లో ఉన్న వ్యక్తి కోల్డ్‌ కాఫీ తయారు చేసిన విధానం వైరల్‌గా మారింది. కోల్డ్‌ కాఫీ తయారు చేసేటప్పుడు అతడు ప్రదర్శించిన బార్‌టెండింగ్‌ స్కిల్స్‌ ఆకట్టుకుంటున్నాయి. గ్లాసును గాల్లో తిప్పడం, పాలు మిశ్రమంలో కలిసిపోయేలా చాలా ఎత్తు నుంచి పోయడం చూసేవారిని ఇట్టే ఆకర్షిస్తుంది. అతనిలోని ట్యాలెంట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.  టిక్‌ టాక్‌లో వ్యూస్‌ అధికంగా రావడంతో.. ఓ నెటిజన్‌ ఈ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. దీంతో ఈ వీడియో మరింత వైరల్‌గా మారింది. అయితే కొంత మంది మాత్రం ఇటువంటి యాప్‌లను చెడు కోసం వినియోగిస్తున్నారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top