వైరల్‌ : వీధికుక్కకు గాయం..ఫార్మసీలోకి వచ్చి..

Injured Stray Dog Enters Pharmacy For Help In Turkey Melts Hearts - Sakshi

జంతువులు కూడా ఒక్కోసారి మనుషుల్లాగే ప్రవర్తిస్తాయి. బాధ కలిగినపుడు ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో తమకు కూడా తెలుసునన్నట్లు వ్యవహరిస్తాయి. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన ఓ ఘటన ఇందుకు తార్కాణంగా నిలిచింది. వారం రోజుల క్రితం ఓ వీధి కుక్క కాలికి తీవ్ర గాయమైంది. దీంతో వెంటనే అది దగ్గర్లోనే ఉన్న ఫార్మసీలోకి పరిగెత్తింది. చికిత్స చేయాలన్నట్లుగా దీనంగా చూస్తూ అక్కడున్న ఫార్మాసిస్టు బానూ సెంగిజ్‌ను వేడుకుంది. ఇంకేముంది.. వెంటనే రంగంలోకి దిగిన బాను ప్రేమగా దానిని దగ్గరకు తీసుకుని చికిత్స చేసింది. ఇందుకు ప్రతిఫలంగా ప్రేమగా చేతిని తాకి తనదైన భాషలో ఆ కుక్క బానుకు ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ విషయం గురించి బాను మాట్లాడుతూ..‘ కుక్క కాలికి దెబ్బ తాకింది. ఫార్మసీలోకి పరుగెత్తుకొచ్చింది. వెంటనే దాని దగ్గరికి వెళ్లి బేబీ.. సమస్య ఏంటమ్మా అని అడిగాను. గోముగా తన గాయాన్ని చూపించింది. ఆయింట్‌మెంట్‌ రాయగానే నా చేతిని నిమిరి నా వైపు ప్రేమగా చూసింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు. ‘ మీరు చేసిన పని మా మనస్సును గెలుచుకుంది. మూగజీవాల పట్ల ప్రేమ చూపాల్సిన ఆవశ్యకతను మరోసారి తెలియజేశారు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top