బేకరీ నిర్లక్ష్యంపై సోషల్‌ మీడియాలో వైరల్‌

Hyderabad's Karachi Bakery, serves food with future manufacturing date

మిల్క్‌ బ్రెడ్‌ తయారీ తేదీని ఒకరోజు ముందుగా

ప్రింట్‌ చేసిన యాజమాన్యం  

హైదరాబాద్‌, అబిడ్స్‌ : నగరంలో పేరుగాంచిన ఓ బేకరీ నిర్లక్ష్యం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ విభాగం అధికారులు నిత్యం పర్యవేక్షించే బేకరీలు, హోటళ్లలో నాణ్యతతో పాటు కనీసం ప్యాకింగ్‌ తేదీలను కూడా సక్రమంగా ముద్రించడంలేదు. ఇందుకు ఉదాహరణే బుధవారం ఎంజే మార్కెట్‌ సమీపంలోని ఓబేకరీ నిర్వాకం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. బిల్క్‌బ్రెడ్‌పై ముందుగా ప్యాకింగ్‌ తేదీని 05–10–2017 అని ప్రచురించి బేకరీ యాజమాన్యం పప్పులో కాలేసింది. ఇలా ఒకరోజు ముందుగా ఎలా తేదీని ప్యాకెట్‌పై ఎలా వేస్తారని వాట్సాప్, ఫేస్‌బుక్‌లో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
 
ఇంతకూ కేసు నమోదయ్యేనా...
బహిరంగంగా నిర్లక్ష్యంగా వహించిన  బేకరీ యాజమాన్యం జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ అధికారులుగానీ, పోలీసులుగానీ ఏ మేరకు కేసు నమోదు చేస్తారో అని సర్వత్రా ఎదురు చూస్తున్నారు. ఈ విషయమై బేగంబజార్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులును వివరణ కోరగా తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top